🌟 బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఓ షూటింగ్లో ఉండగానే ఆయనకు ఛాతీ నొప్పితో వచ్చినట్టు సమాచారం.
దీంతో ఆయన్ను కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ మూవీ సిబ్బందే చేర్చారట. ప్రస్తుతం మిథున్‌కు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మిథున్ చక్రవర్తి కి MRI స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. వైద్యులు అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారని... అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి సిబ్బంది ఆయన హెల్త్‌కు సంబంధించి ఎలాంటి బులిటెన్ బయటికి రిలీజ్ చేయకపోవడం... అందర్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరో, డిస్కోడ్యాన్సర్ అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. నేటికీ మిథున్ చక్రవర్తికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు బయటికి రావడంతో... అభిమానులు అందోళన చెందుతున్నారు. 🌡👨⚕️🎬