top of page
Shiva YT

🌊 గంట ముందే భూకంపాన్ని గుర్తించే టెక్నాలజీ హైదరాబాద్‌లోనే...

🌐 దేశంలోని మొట్టమొదటి సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీస్ (SynOPS) ల్యాబ్‌ను ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ సముద్రంలో సంభవించే భూకంపం, సునామీలను ఒక గంట ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేస్తుంది.ℹ️ఈ ల్యాబ్‌ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు హాజరయ్యారు.ల్యాబ్‌కు సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు.🌀

ℹ️ ఇక ఈ ల్యాబ్‌ నుంచి వచ్చిన సమాచారం విపత్తు నిర్వహణ విభాగానికి పంపిస్తారు. NDRF, SDRF లాంటి బృందాలు సకాలంలో సహాయ చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సునామీ, తుఫాను వంటి విపత్తుల గురించి సమాచారం కోసం అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి సహాయం తీసుకునే వారు కానీ ప్రస్తుతం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాబ్‌తో దేశీయంగా సమాచారం పొందొచ్చు.

🌀 ఇక తుఫాన్‌లకు సంబంధించిన సమాచారాన్ని కూడా 3 నుంచి 4 రోజుల ముందుగానే Synops ల్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో హిందూ, పసిఫిక్ మహాసముద్రాలతోపాటు అన్ని మహాసముద్రాల సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థ చేపల కదలిక గురించి కూడా సమాచారాన్ని అందించగలదు. సముద్రంలో ఏ దిశలో ఎక్కువ చేపలు తెలుసుకొని, మత్య్సగారులకు వివరాలను అందిస్తుంది. 🐟


bottom of page