top of page

"అయోధ్య పై నోరు పారేసుకున్న తృణమూల్ ఎమ్మెల్యే..🌿

Shiva YT

రామాలయం విషయంలో టీఎంసీ ఎమ్మెల్యే రామేందు సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ మందిరాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. దీనితో పాటు పూజల కోసం ఏ హిందువు రామాలయానికి వెళ్లకూడదని పిలుపు నిచ్చారు. తారకేశ్వర్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటనపై పెను దుమారం చెలరేగింది. రామేందు సిన్హా చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామేందు సిన్హా చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అంటూ ఖండిస్తున్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో వారి అసలు నైజం ఇదే అంటూ బీజేపీ నేత సువేందు చెప్పారు. అంతేకాదు ఓ హిందువులపై దాడులు చేస్తూనే ఉన్నారు.. మరోవైపు టీఎంసీ నేతల ధైర్యం ఎంతగా పెరిగిపోయిందంటే.. శ్రీ రాముని మహాదేవాలయాన్ని ‘అపవిత్రం’ అని పిలుచుకునే ధైర్యం కూడా వచ్చేసింది. రోజు రోజుకీ హిందువులపై దాడులు చేసే దైర్యం ఎక్కువైందని చెప్పారు.

రామమందిరం అపవిత్రమని తారకేశ్వర్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ వ్యాఖ్యానించారు. అలాంటి అపవిత్ర ప్రదేశంలోని ఆలయంలోని దైవాన్ని భారతీయ హిందువులు ఎవరూ పూజించకూడదని కూడా ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భగవంతుడు శ్రీరాముని పట్ల TMC నాయకత్వ భావాన్ని వెల్లడిస్తుంది.

రామమందిరం అపవిత్రమని తారకేశ్వర్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ వ్యాఖ్యానించారు. అలాంటి అపవిత్ర ప్రదేశంలోని ఆలయంలోని దైవాన్ని భారతీయ హిందువులు ఎవరూ పూజించకూడదని కూడా ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భగవంతుడు శ్రీరాముని పట్ల TMC నాయకత్వ భావాన్ని వెల్లడిస్తుంది. 🕉️🚩"

 
bottom of page