నా భర్త చనిపోయినప్పుడు చాలా ఏడ్చా.. విలవిలలాడిపోయా.. నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడే డైరెక్టర్ సురేశ్ తేజతో పెళ్లి జరిగింది. ఇప్పుడు నా వయసు 40 దాటింది. కానీ నా పై రకరకాల కామెంట్స్ చేశారు, ట్రోల్ చేశారు. భర్త చనిపోయిన తర్వాత విచ్చల విడిగా తిరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ వయసులోనూ 20 ఏళ్ల పిల్లలా ఎంజాయ్ చేస్తుంది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు..😞
ఆతర్వాత వాటిని పట్టించుకోవడం మానేశా.. అందరి నోర్లు మూయించలేం కదా.. న భర్త ఉన్నా కూడా ఇలానే ఉంటా.. సింగిల్ పేరెంట్ ను కదా ఈ విమర్శలు, అవమానాలు ఉంటూనే ఉంటాయి. కొంతమంది నా గురించి వీడియోలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని తెలిపింది సురేఖ. నా భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను అతన్ని సరిగ్గా చేసుకోలేదని నా భర్త కుటుంబసభ్యులు అనుకుంటున్నారు. నా భర్తకు డయాబెటిస్ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్ గా ఆయన గుండె ఆగిపోయింది. ఇక నాకు ఎవరితోనే ఎఫైర్ ఉందని.. అందుకే రిచ్ గా బతికేస్తున్నా అని అనుకుంటున్నారు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నన్ను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారు. నాకు ప్రశాంతమైన జీవితం అవ్వమని తిరుపతిలో మొక్కుకొని గుండు చేయించుకున్నా.. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అడిగారు కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు అని అన్నారు సురేఖ వాణి. 😢