top of page
Suresh D

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ టెక్ హబ్‌లలో ఒకటిగా ఉంది. టెక్నాలజీను అందిపుచ్చుకుని ప్రపంచ దేశాలను హైదరాబాద్‌ను ఆకర్షిస్తుంది. అయితే తెలంగాణలోని 50 శాతానికి పైగా యువత అటాచ్‌మెంట్‌తో కూడిన ఇమెయిల్‌ను పంపలేరని ఇటీవల ఓ నివేదిక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అలాగే కేవలం 14.27 శాతం మంది యువత మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్‌ను సృష్టించగలరని ఇటీవల విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది. తెలంగాణలో యువత 2021 నాటికి 9.9 మిలియన్లుగా అంచనా వేశారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా ప్రచురించిన ఈ నివేదిక దేశంలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు  ఉన్న యువతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) నైపుణ్యాలను కొలుస్తుంది. తెలంగాణతో పోల్చితే మిగతా దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి.అటాచ్‌మెంట్‌లతో కూడిన ఈ-మెయిల్‌లను పంపే సామర్థ్యం ఉన్న వారిలో 73.34 శాతం మంది కేరళ యువత అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 55.33 శాతంతో తమిళనాడు నిలిచింది.

bottom of page