top of page
MediaFx

మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు చేశారంటే..


తాళం వేసి ఉన్న ఇళ్ళల్లోనో, బ్యాంక్ లోనో, అనేక రకాల దొంగతనాలు గురించి తెలుసు. కానీ, ఓ మామిడి నర్సరీలో ఉన్న మోటార్ ను ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం, జమ్ముగూడెంలో జరిగిందీ ఘటన. గ్రామంలో గోపి అనే వ్యక్తి మామిడి మొక్కల నర్సరీని ఏర్పాటు చేసుకొని మొక్కలు ఎగుమతి చేస్తుంటాడు. అయితే ఆ మొక్కల ఖరీదు ఎక్కువుగా ఉండటం, చుట్టుపక్కల జన సంచారం తక్కువుగా ఉండటం.. గత కొద్ది నెలలుగా అశ్వారావుపేట పరిసర ప్రాంతంలొని పొలాల్లో, తోటల్లో మోటార్లు చోరీకి గురి అవుతుండటంతో నర్సరీ యజమాని గోపి తన మామిడి నర్సరీలో ముందు జాగ్రత్తగా సి.సి కెమెరాలు ఏర్పాటు చేశాడు. సి.సి కెమెరాలు ఉన్న విషయం తెలియని దొంగలు నర్సరీలోకి ప్రవేశించి ఎంతో దర్జాగా, అదేదో తమ సొంత నర్సరీలో మోటార్ చెడిపోయినట్లు ఆ మోటార్ కు విద్యుత్ కనెక్షన్ తొలగించి, మోటార్‌తో ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆలస్యంగా నర్సరీకు వచ్చిన యజమాని విద్యుత్ వైర్లు కత్తిరించి ఉండటంతో అక్కడ ఉండవలసిన మోటార్ లేకపోవటంతో అనుమానం వచ్చింది. వెంటనే సి.సి కెమెరాలో చూడగా ఇద్దరు వ్యక్తులు మోటార్ ను దొంగిలించిన దృశ్యాలు వెలుగుచూశాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఈ మోటార్ దొంగలను గుర్తించాలని,సోషల్ మీడియాలో కూడా పెట్టడంతో ఈ దొంగతనం దృశ్యాలు వైరల్ అయ్యాయి,పోలీసులు వీరిని పట్టుకొనే పనిలో నిమగ్నం అయ్యారు

bottom of page