top of page

42 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ.. 34 కోర్టు కేసులు, హీరోయిన్‌కు వేధింపులు.. కానీ..! 🎬🤩

Suresh D

దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ సినిమా ఎదో తెలుసా…? ఆ సినిమా పై ఏకంగా 34 కేసులు పెట్టారు. అంతే కాదు హీరోయిన్ ను వేధించారు కూడా.. 😮




సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ చాలా మంది గొడవలు చేస్తున్నారు. ఒక సినిమా బయటకు రావాలంటే అది ఏ కాంట్రవర్సీకి దారి తీస్తుందో అని నిర్మాతలు దర్శకులు ఆలోచించే రేంజ్ కు వచ్చేసిందిచాలా మంది దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతోనే సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ క్రమంలోనే సమాజంలో జరిగే వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అవి ప్రశంసలతో పాటు విమర్శలను కూడా మూటగట్టుకుంటుంటాయి. అయితే దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ సినిమా ఎదో తెలుసా…? ఆ సినిమా పై ఏకంగా 34 కేసులు పెట్టారు. అంతే కాదు హీరోయిన్ ను వేధించారు కూడా.. 😮

ఈ మధ్య కాలంలో బాయ్ కాట్ ట్రెండ్ వచ్చింది. సినిమాలో ఏదైనా అభ్యంతరకర సన్నివేశం వచ్చినా సరే సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నినాదాలు చేయడం. సినిమా పై కేసులు వేయడం చేస్తున్నారు కొందరు. ఆయితే ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా.. వాటన్నింటిని దాటుకొని రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే కాంట్రవర్సీలు అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నడుస్తున్న విషయమే. దాదాపు 42 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ సినిమా దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ నిలిచింది. 😲

ఆ సినిమానే నికాహ్.. ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కింది. ట్రిపుల్ తలాక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు బీఆర్ చోప్రా దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమాకు తలాక్ తలాక్ తలాక్ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత టైటిల్ ను మార్చారు. అయితే ఈ సినిమాలో ముస్లింల మనోభావాలను ఎంతో దెబ్బతీసేలా ఉండటంతో వారు సినిమా పై విమర్శలు చేశారు. అంతే కాదు ఈ సినిమా పై 34 కేసులు పెట్టారు. అంతే కాదు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ జీవితంలో ఎన్నడూ చూడని వేధింపులు ఎదుర్కొంది. నికాహ్‌లో నటించిన మెయిన్ హీరోయిన్ సల్మా అఘాను బెదిరింపులు, వేధింపులకు గురి చేశారు. సినిమా నిలిపివేయడానికి చాలా గొడవలు జరిగాయి. థియేటర్స్ దగ్గర ఆందోళనలు కూడా జరిగాయి. కానీ ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రూ. 4 కోట్లతో నిర్మించిన నికాహ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 9 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో అది సంచలన విజయం. ఇలా కాంట్రవర్సీతోనే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 🎉🎥

 
bottom of page