top of page
Shiva YT

మోదీ పాలనలో మహిళల స్వప్నం ఇలా సాకారమైంది.. 💪👩‍🦰

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సధికారతే లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ప్రధానంగా చెప్పుకునేవి ముద్ర యోజన, జన్‌ ధణ్‌ యోజన, పీఎం అవాస్‌ యోజన ఇలా ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం మొదలు ఎన్నో ప్రయోజనాలు సాకారమయ్యాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ పాలనలో అమల్లోకి తెచ్చిన పథకాలపై రూపొందించిన వీడియోలను బీజేపీ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్‌ చేశారు. ముఖ్యంగా పీఎం ముద్ర యోజన పథకానికి సంబంధించిన వీడియోలను తమిళ్‌, తెలుగు, మలయాలం, కన్నడ, అస్సామీ, ఒడిశా, బెంగాలీ, హిందీ భాషల్లో వీడియోలను రూపొందించారు. ఈ వీడియోలను బీజేపీ అధికారిక అకౌంట్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన ముద్ర యోజన, జన్‌ ధన్‌ యోజన, ఉజ్వల యోజన, పీఎమ్‌ అవాస్‌ యోజన పథకాలకు సంబంధించిన ఐదు వీడియోలను విడుదల చేశారు.

భారత్‌లో కోట్లాది మంది మహిళల కలలను బీజేపీ ప్రభుత్వం ఎలా సాకారం చేసిందన్న విషయాలను ఈ వీడియోల్లో స్పష్టంగా వివరించారు. మోదీ ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హమీలకు సంబంధించిన వివరాలతోపాటు, తక్కువ సమయంలో మహిళల కలలను సాకారం చేసిన విధానాన్ని వీడియోల్లో వివరించారు.


bottom of page