టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని మూడేళ్లు గడిచిపోయింది. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు... 2021లో విడాకులు తీసుకున్నట్టు ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతోనే విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు.
అయితే, ఏ కారణాలతో విడాకులు తీసుకున్నారనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. జనాలు మాత్రం ఎవరికి తోచినట్టు వారు ఊహించేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజెన్ సమంతను తన ప్రశ్నతో ఇబ్బంది పెట్టాడు. అమాయకుడైన నాగచైతన్యను ఎందుకు మోసం చేశావని ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమంత కూడా చాలా కూల్ గా సమాధానమిచ్చింది. ఈ ప్రశ్న వేయడం మీకు మంచిది కాకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించింది. ప్రశ్నించడానికి మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలని చెప్పింది. మీరు బాగుండాలని తాను కోరుకుంటున్నానని తెలిపింది. మరోవైపు పలువురు నెటిజెన్లు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. సమంత వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు.