🌐 పార్లమెంట్ భద్రత లోపంపై, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. పార్లమెంటు దాడి వెనుక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణమని రాహుల్ స్పష్టం చేశారు.
కొత్త పార్లమెంటుకు గట్టి భద్రతా ఉంది, అయితే ఇది ఎందుకు జరిగింది? అని రాహుల్ ప్రశ్నించారు. 🤔 దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య, దీనికి సంబంధించి దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. 🌍🤔 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాల వల్ల భారతదేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. 🚫 మోదీ విధానాల వల్ల పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ ధ్వజమెత్తారు. 🚩 భారదేశ జనాభా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. 🌐