ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్ అంటే క్రేజ్ బాగా పెరిగిపోయింది. బిజీ లైఫ్‌లో షాపింగ్ మాల్ కెళ్ళి షాపింగ్ చేయడం అంత ఈజీ పని కాదు. అందుకని చాలామంది ఆన్‌లైన్‌ని ఆశ్రయిస్తున్నారు. గుండు పిన్నిస్ నుంచి టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్‌తో వస్తున్న అన్ని వస్తువులు ఆన్లైన్లో విరివిగా లభిస్తున్నాయి. దీంతో చాలామంది ఆన్‌లైన్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
ఆన్లైన్ షాపింగ్‌కు పెరిగిన క్రేజ్‌తో దాదాపు దేశంలో 60 శాతంకి పైగా యాప్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (pwc)ఇండియా తాజాగా విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. దాదాపుగా గత కొన్ని సంవత్సరాలలో 12 కోట్లకు పైగా ఆన్లైన్ షాపింగ్ చేశారని రిపోర్టు తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం బయట షాపింగ్ మాల్లో అందుబాటులో ఉండే స్టాక్ చాలా తక్కువగా ఉండడం లేక లేటెస్ట్ స్టాక్ అందుబాటులో లేకపోవడం కారణంగా చాలామంది ఆన్లైన్ షాపింగ్ వైపు చూస్తున్నారని రిపోర్ట్ తెలిపింది.
ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్, పాపులర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా అందుబాటులో ఉండడం వాటికి డిస్కౌంట్లు, రిఫండ్స్, రివ్యూస్ ,రేటింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య బాగా పెరుగుతుంది అని రిపోర్ట్ వెల్లడించింది. ఈ మధ్యకాలంలో మేజర్ మెట్రో సిటీస్ తో పాటు శివారు ప్రాంతాలకి, చిన్నచిన్న సిటీ లకు ఈ ఆన్లైన్ షాపింగ్ విస్తరించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 200 మందిని సర్వే చేసి pwc ఇండియా పేర్కొంది.పెరిగిన ఆన్లైన్ షాపింగ్ కి ఫేస్బుక్ ,ఇన్స్టాగ్రామ్ ,యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఇలా సోషల్ మీడియాలో చూసి కొత్త బ్రాండ్స్తోపాటు ఆన్లైన్ ట్రై చేసేవారు 62 శాతం మంది ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది.