top of page

🌍🌦️🌾 తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గడ్డకట్టుకుపోతుంది..

🌐 తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం కారణంగా అక్కడి స్థానికులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అకాల వాతావరణ మార్పుల వల్ల అక్కడి వ్యవసాయం కూడా ప్రభావితం అవుతుంది. పచ్చని పచ్చిక బయళ్ళు మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. దట్టమైన పొగమంచు చుట్టూ పరిసరాలను మంచెత్తింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ విధమైన చలి వాతావరణం అసాధారణమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల స్థానికులు వీధుల్లో మంటలువేసి, వాటి చుట్టూ కూర్చుని తమను తాము వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఉదగమండలంలోని కాంతల్, తలైకుంట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. బొటానికల్ గార్డెన్‌లో 2 డిగ్రీల సెల్సియస్, శాండినాల్లాలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.

🌡️ అక్కడ అకాలంగా ఉన్న అసాధారణ చలి వాతావరణంపై స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్విరోమెంట్ సోషల్ ట్రస్ట్ (NEST)కి చెందిన వి శివదాస్ చెబుతున్నారు. చలి తీవ్రత మరింత పెరుగుతోందని, ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి ప్రాంతంలో సవాల్‌గా మారిందని, దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. 🌱🌿

 
 
bottom of page