top of page
MediaFx

‘థగ్ లైఫ్’ లోకి శింబు వచ్చేసాడు..


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “థగ్ లైఫ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మెయిన్ గా మణిరత్నం, కమల్ నుంచి వస్తున్నా రెండో సినిమా కావడం పైగా ఇద్దరూ కలిపి కథని డెవలప్ చేయడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శింబు కూడా నటిస్తున్నాడు అని కొన్ని రూమర్స్ రాగా ఫైనల్ గా దీనిని అఫీషియల్ గా ప్రకటిస్తూ ఓ సాలిడ్ ఇంట్రో వీడియోతో కూడా రిలీజ్ చేశారు. కొత్త థగ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు అని అనౌన్స్ చేసేసారు.మరి ఆల్రెడీ, జయంరవి, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తుండగా ఇప్పుడు శింబు కూడా జాయిన్ అయ్యాడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఫిల్మ్స్ అలాగే మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.



bottom of page