top of page

అలా అడగ్గానే చెంప పగలగొట్టాలి.. మండిపడ్డ హీరో విశాల్


అమ్మ బోర్డు సభ్యులు మోహన్‌లాల్‌, జడగీష్‌, జయన్‌ చేర్యాల, సిద్ధిక్‌, బాబురాజ్‌, ఉన్నిముకుందన్‌, అనన్య, అన్సిబా హసన్‌, జాయ్‌ మాథ్యూ, జోమోల్‌, కళాభవన్‌ షాజోన్‌, సరయు మోహన్‌, సూరజ్‌ వెంజరమూడ్‌, సురేష్‌ కృష్ణ, టైనీ టామ్‌, టోవినో థామస్‌, వినుమోహన్‌ అమ్మకు రాజీనామా చేశారు. అయితే లైంగిక ఆరోపణలు రావడంతో జనరల్ సెక్రటరీ సిద్ధిక్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. హేమ కమిటీ రిపోర్ట్ పై తాజాగా స్టార్ హీరో విశాల్ మాట్లాడారు. తమిళ్ ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు విశాల్. ఆయన మాట్లాడుతూ.. “హేమ కమిటీ రిపోర్ట్‌లోని విషయాలు చూసిన తర్వాత నేను షాకయ్యా. ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం నిజంగా బాధాకరం. సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తామని తప్పుగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పాలి. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆడవాళ్లు దైర్యంగా ఉండాలి. సినిమా అవకాశాల పేరుతో లైంగికంగా వేధించడానికి ప్రయతినిస్తే చెంప చెళ్లుమనిపించాలి. కొంతమంది కేటుగాళ్ళు ఫేక్ ప్రొడక్షన్స్ పేర్లతో కోలీవుడ్‌లోనూ మహిళలను వేధిస్తున్నారని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.. ఈమేరకు ఓ ప్లాన్ రెడీ చేస్తున్నాం అని విశాల్ అన్నారు. నేడు విశాల్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు.

 
 
bottom of page