top of page
Suresh D

వివాదంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా .. 🎥🌟

ఈ సినిమాలో తమ జాతిని, తమ గ్రామాన్ని అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసన చేస్తున్నారు స్టువర్టుపురం గ్రామస్థులు. ఎరుకల జాతిని అవమానించేలా సినిమా తెరకెక్కిస్తున్నారని నిరసన చేస్తున్నారు గ్రామస్థులు.

ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టువర్టుపురంలోని ఓ గజ దొంగ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాను ఆపేయాలని అంటున్నారు కొందరు. టైగర్ నాగేశ్వరరావు విడుదల చేయొద్దంటూ డిమాండ్ చేస్తూ స్టువర్టుపురం గ్రామస్థులు నిరసనకు దిగారు.

ఈ సినిమాలో తమ జాతిని, తమ గ్రామాన్ని అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసన చేస్తున్నారు స్టువర్టుపురం గ్రామస్థులు. ఎరుకల జాతిని అవమానించేలా సినిమా తెరకెక్కిస్తున్నారని నిరసన చేస్తున్నారు గ్రామస్థులు. ఇప్పటికే హైకోర్టులో స్టువర్టుపురం గ్రామస్థులు పీటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమాతో లక్షల మంది ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీస్తున్నారని స్టువర్టుపురం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.🎥🌟

bottom of page