top of page
Suresh D

టిల్లు స్వ్కేర్ బాక్సాఫీస్ కలెక్షన్స్..🎥✨

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి హడావిడి కనిపిస్తుంది. మొన్నటి వరకు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు టిల్లు స్వ్కేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

గత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల వేట కొనసాగిస్తుంది టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. మొదటి రోజే రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. నాలుగు రోజుల్లోనే రూ. 85 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 91 కోట్లు వసూలు చేసింది. వారం రోజులుగా సూపర్ హిట్ టాక్ తో టిల్లుగాడు కుమ్మేస్తున్నాడు. ఈ సినిమా ఈజీగా రూ. 100 కోట్లు రాబడుతుందని మొదటి రోజే చెప్పేశాడు నిర్మాత నాగవంశీ. ఇక ఇప్పుడు అదే మాటను నిజం చేస్తూ దూసుకుపోతున్నాడు టిల్లుగాడు. మొత్తం 7 రోజుల్లో రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది టిల్లు స్క్వేర్. ఒకటి రెండు రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి ఫస్ట్ డేనే చెప్పి మరీ కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు టిల్లు .🎥✨

bottom of page