top of page
Suresh D

టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్‌లో చేరితే..🎥✨

కొన్ని సినిమాలకు హీరోలతో పనుండదు.. కేవలం ఆ కారెక్టర్‌తోనే క్రేజ్ వస్తుంది.. అలాంటి టిపికల్ కారెక్టర్ డిజే టిల్లు. సిద్ధూ జొన్నలగడ్డ క్రియేట్ చేసిన ఈ కారెక్టర్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది. స్టార్ హీరోల రేంజ్‌లో రప్ఫాడిస్తున్నాడు టిల్లు భాయ్.

మరి వీకెండ్ ముగిసేసరి టిల్లు స్క్వేర్ సాధించిన రికార్డులేంటి..? కలెక్షన్స్ ఎన్ని..? డిజే టిల్లు వచ్చినపుడు సిద్ధూ జొన్నలగడ్డ అంటే ఎవరో పెద్దగా ఐడియా లేదు.. పెద్దగా ఇమేజ్ కూడా లేదు.. ఓటిటితో పరిచయం ఉన్న వాళ్లకు మాత్రమే సిద్ధూతోనూ పరిచయం ఉండేది.కానీ డిజే టిల్లుతో తన మేనరిజమ్స్‌తో ప్రతీ ఇంటికి పరిచయం అయిపోయారు సిద్ధూ. ఇప్పుడు టిల్లు స్క్వేర్‌తో స్టార్ బాయ్ అయిపోయారు ఈ కుర్రాడు.

మొదటిరోజే 24 కోట్లు వసూలు చేసిన టిల్లు స్క్వేర్.. తర్వాత రెండ్రోజుల్లోనూ అదే దూకుడు చూపించింది. 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం.ఈ దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీక్‌లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయేలా ఉంది టిల్లు స్క్వేర్. తాజాగా చిరంజీవి సైతం టిల్లు టీంను ప్రశంసించారు.

టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్‌లో చేరితే.. మీడియం రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ, నాని, తేజ సజ్జా, రవితేజ, నిఖిల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన హీరోగా సిద్దూ నిలుస్తారు.

ఎలాగూ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి టిల్లు గాడి జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. మొత్తానికి చూడాలిక.. సిద్దూ దూకుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో..?

bottom of page