top of page
MediaFx

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాఘవ లారెన్స్..


క‌లియుగ దైవం తిరుమ‌ల వేంక‌టేశ్వర స్వామిని కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava lawrence) దర్శించుకున్నారు. శ‌నివారం ఉద‌యం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. అనంత‌రం మొక్కులు చెల్లించుకునాడు. ఇక లారెన్స్‌కు టీటీడీ అధికారులు ఘ‌న‌స్వాగతం ప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే తిరుమ‌ల‌కు వచ్చిన లారెన్స్‌ను చూసిన అభిమానులు భక్తులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం కాంచ‌న 4. ఇప్ప‌టికే ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచ‌న 2, కాంచ‌న 3 చిత్రాలు వ‌చ్చి మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి కాంచ‌న 4ను అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మూవీలో క‌థానాయిక‌గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 2025 స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.




bottom of page