top of page
Suresh D

🔮🌟నేటి రాశి ఫలాలు 28.12.2023: వీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది🔍 🔮

నేటి రాశి ఫలాలు తేదీ 28 డిసెంబరు 2023 మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. రాజకీయ నాయకులకు అనుకున్న పదవులు లభిస్తాయి. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అప్పులు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగవర్గాలు నూతనోత్సాహంతో గడుపుతారు. ప్రమోషన్లు దక్కే అవకాశముంది. విద్యార్థులు, నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వాహనాలు, వస్తువులు కొంటారు. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు నిరాశ. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. తరచూ ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. బంధువులు, స్నేహితులతో తగాదాలు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. శారీరక రుగ్మతలు కలుగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందిపెడతాయి. ఉద్యోగులకు అదనపు విధులు గందరగోళంగా ఉంటాయి. వ్యాపారులు పెట్టుబడులు అందక ఇబ్బందిపెడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబములో చికాకులు పెరుగుతాయి. సోదరులతో విభేదాలేర్పడతాయి. ఆస్తి వివాదాలు ఏర్పడుతాయి. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. శివపార్వతుల అర్ధనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అకారణంగా గొడవలు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు ఇబ్బందిపెట్టును. అప్పులు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు విస్తరణ చర్యలు ముందుకు సాగవు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటంచాలి. కళాకారులకు అవకాశాలు చేజారి నిరాశ మిగులుతుంది. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్టులు చేజారతాయి. భూవివాదాలు నెలకొంటాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. భాగస్వామ్య వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పదవులు రాగలవు. బాకీలు అందుతాయి. పరపతి పెరుగుతుంది. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్థిరాస్థి వృద్ధి. కన్యారాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగించవచ్చు. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. పెట్టుబడులు అందక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. బంధువులు, స్నేహితులతో అకారణ తగాదాలు. తరచూ ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త ఆలోచనలు స్థిరంగా ఉండవు. దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మొదలుపెట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తిచేస్తారు. వాహనాలు, స్థూలు కొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. బాకీలు అందుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు ఆర్డిస్తేరు. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. వాహనాలు కొంటారు. పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఒక ఆహ్వానం సంతోషం కలగిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. విద్యార్థులకు అనుకూలం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు లభిస్తాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబములో చికాకులు. దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులు, స్నేహితులతో గొడవలు. ఆలోచనలు నిలకడగా ఉ౦డవు. దూరప్రయాణాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కృషి ఫలించదు. రాబడి తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు ఇబ్బందిపెడతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీనరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆస్తి విషయాలలో తగాదాలు వస్తాయి. చేపట్టి పనులలో ఆటంకాలేర్పడును. కుటుంబ బాధ్యతలు ఇబ్బందికి గురిచేస్తాయి. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. ఉద్యోగులకు ప్రమోషన్లు చేజారతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

bottom of page