ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. మేషం
ఓ శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రుల సహకారంతో మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి
2 వృషభం
ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో అస్సలు తలదూర్చకండి.
3 మిథునం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి.
4 కర్కాటకం
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఓ వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం అస్సలు కోల్పోకూడదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
5 సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. కీలక సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా మీకు ఇది మేలైన సమయం.
6 కన్య
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
7 తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
8 వృశ్చికం
భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
9 ధనుస్సు
ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనుల వల్ల ముందుకు సాగితే మీ యొక్క కీర్తి పెరుగుతుంది.
10 మకరం
దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం చాలా ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి.
11 కుంభం
కొన్ని ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెడుతాయి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
12 మీనం
మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు, మిత్రులతో సహా సంతోషంగా గడుపుతారు.