top of page
MediaFx

నేటి నుండి భద్రకాళి అమ్మవారి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు..


శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.. నేటి నుండి 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ రోజు సహస్ర కలిశాభిషేకాలు, గణపతి పూజ, పూర్వంగవిధి కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఏటా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అధిక మాసం వల్ల ఈసారి 16 రోజుల పాటు నిర్వహించనున్నారు.. 21వ తేదీ పౌర్ణమి రోజున సంపూర్ణ శాకాంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పలాలతో అలంకరించి ఆరాధిస్తారు.. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరి చేరదని కచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వసం..

ఆషాఢ మాసంలో మొట్టమొదటి శాకాంభరీ ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ఆరంభమవుతాయి.. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు.. శాకంభరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు.

bottom of page