top of page
Suresh D

🔮🌟ఈరోజు మిధునం, తులా రాశులకు కష్టాల నుంచి విముక్తి..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...🔍 🔮

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగినవారు పరిచయమై సాయపడతారు. రాబడికి లోటు ఉండదు. వేడుకలకు ఖర్చుచేస్తారు. ఉద్యోగాన్వేషణలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. క్రీడాకారులు విజయాలు సాధిస్తారు. వ్యాపారులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నతస్థితికి చేరుకుంటారు. గణపతి పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల సమయం. అదనపు రాబడి, చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖుల పరిచయం అవుతుంది. విద్యార్థులు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సలహా స్వీకరిస్తారు. కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలకి కార్యరూపం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అడ్డంకులు తొలగుతాయి. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అధిక ఖర్చుల వల్ల అప్పులు చేస్తారు. కొన్ని విషయాలలో రాజీమార్గం తప్పనిసరి. వాహనాలు నడిపేవారు అప్రమత్తత పాటించాలి. వ్యాపారులు అందిన లాభాలతో సరిపెట్టుకోవడం మంచిది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. శుభవర్తమానాలు అందుతాయి. బంధుమిత్రుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తారు. మీ మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. రావలసిన డబ్బు అందడంలో జాప్యం జరుగుతుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టసాధ్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. విందులు, వినోదాలు ఉంటాయి. వాహనసౌఖ్యం. కొత్త పరిచయాలు. ఆస్తుల వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. విద్యార్థులు అవకాశాలు కొన్ని చేజారవచ్చు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సింహ రాశి సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు ప్రతిభ గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు విధుల నుంచి ఉపశమనం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అరుదైన ఆహ్వానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. తండ్రి తరపు వారి నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలున్నాయి. క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాల అన్వేషణలో కొంత విజయం. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆత్మీయులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో హామీలు మంచిది కాదు. ఆస్తుల వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణాల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు దక్కవు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. క్రీడాకారులు ఎటూ తేల్చుకోని స్థితిలో పడతారు. ఆహ్వానాలు అందుతాయి. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. తులా రాశి తులా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగాన్వేషణలో ప్రతిబంధకాలు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళాకారుల అంచనాలు నిజమవుతాయి. ధనప్రాప్తి, విందు వినోదాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభ కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగయత్నాలలో అనుకూలం. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. స్వచ్చంద సంస్థలకు విరాళాలు ఇస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ధనూ రాశి ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలం. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు కుదురుతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు మార్గం సుగమం. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రీడాకారులకు అవార్డులు దక్కుతాయి. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి. మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. తండ్రి తరపు వారితో విభేదాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. వాహన సౌఖ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి కుంభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. తండ్రి తరపు వారితో అకారణ విరోధాలు. తరచూ ప్రయాణాలు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. కోర్టు వ్యవహారాల్లో ప్రతిబంధకాలు. రావలసిన బాకీలు సకాలంలో రావు. వ్యాపారుల కష్టానికి తగిన లాభాలుండవు. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పకపోవచ్చు. క్రీడాకారులు లక్ష్యాలో వెనుకబడతారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఆదాయం మెరుపగదే అవకాశముంది. అయితే ఖర్చుల అదుపు చేసుకోవాలని సూచిన. విద్యావకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. భూవివాదాల పరిష్కారం. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. సాంకేతిక రంగాల వారికి మరింత సానుకూలంగా ఉంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు, ఉద్యోగులు ఎంతటి పనిబారమైనా అవలీలగా అధిగమిస్తారు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

bottom of page