నేటి రాశి ఫలాలు.. వీరు మంచికి పోతే చెడు ఎదురవుతుంది 🔍 🔮
- Suresh D
- Nov 4, 2023
- 3 min read
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...🔍 🔮

మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన విషయంలో శుభపరిణామాలు. వేడుకల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. మానసిక ఆందోళనకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వృషభ రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. వాహనాలు నడిపే సమయంలో నిదానం అవసరం. విలాస ఖర్చులు అధికమగును. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలను సాధిస్తారు. కోపావేశాలకు దూరంగా ఉండాలని సూచన. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతాన విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందుకుంటారు. ఆభరణాల కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తారు. ఆత్మీయుల కోసం ఖర్చులు అధికముగా చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలోనివారు ఉన్నత పదవులు అందుకుంటారు. పిల్లల విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశముంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సింహ రాశి సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుంచి మాట పడాల్సి వస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంనుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉ౦ది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు తీసుకోవలసివస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. తులా రాశి తులా రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి. వృశ్చిక రాశి వృశ్చిక రాశికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఉదరసంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ధనూ రాశి ధనూ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్ధిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమలు ఫలిస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి వ్యాపారపరంగా శుభఫలితాలున్నాయి. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బందిపడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అధికం. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. కుంభ రాశి కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాల్లో నిదానం పాటించాలి. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. జన్మరాశిలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ఆహార నియమాలు పాటించాలి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లుకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. బంధాలు బలపడతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ చూపాలి. తీర్థయాత్రలు, దానధర్మాలకు, విలాసాలకు ఖర్చు చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.