జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆఫీసులో అధికారులతో, తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉంటారు. చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచివారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. వ్యవసాయదారులకు, రాజకీయదారులకు అనుకూల సమయం. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. కొంత శ్రమ ఉండవచ్చు. తగిన ప్రతిఫలము ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బరువు, బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. తోటి ఉద్యోగులతో స్నేహింగా ఉంటారు. బంధుమిత్రులతో కార్య సాఫల్యం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృథా ఖర్చులుంటాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చును. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. రాజకీయ, కోర్టు పనులు వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఊహించని వ్యయాలు ముందుకు వస్తాయి. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. తీరయాత్రలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వాహనాలు, భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. కర్కాటకరాశివారికి వారికి మరింత శు భఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి. సింహ రాశి సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. రావలసిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నలుగురి సహకారము లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు, విహార యాత్రలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనులలో కొంత ఆలస్యం జరిగినా నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ, రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలుంటాయి. బంధువర్గంలో కొద్దిగా అభిప్రాయభేదాలుంటాయి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలించును. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలుంటాయి. అన్నదమ్ములతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల వల్ల కొంత ఖర్చు ఉండవచ్చు. ఇరుగుపొరుగు సహకారం లభిస్తుంది. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి. తులా రాశి తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు. రాబడికి మించిన ఖర్చులుండవచ్చు. నియంత్రణ అవసరం. బరువు, బాధ్యతలు, శ్రద్ధ పెరుగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో పనులు పూర్తి చేయడంలో జాప్యం జరగవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి కార్య నిర్వహణపై దృష్టి సారిస్తారు. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుడిని పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తిదారులు, ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యాపారాలు, రోజువారి కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. వాహన, భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలించవచ్చు. రాజకీయ, ప్రభుత్వ పనులలో సానుకూల ఫలితాలుంటాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి. ధనూ రాశి ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. పనులలో బరువు, బాధ్యతలు పెరిగినా సంతోషంగా స్వీకరిస్తారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. పదోన్నతి ఉంటుంది. సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. విల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది. మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. భార్యాపిల్లలతో ఆనందముగా గడుపుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారితో సంబంధాలు పెంపొందుతాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు. తీరయాత్రలపై మనస్సు నిలుపుతారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అప్టోతర శతనామావళి పఠించండి. కుంభ రాశి కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. అనవసర ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా వేయవచ్చు. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కలసివస్తుంది. ఖర్చులు నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నలుగురికీ ఉపయోగపడే పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మంచిస్థాయిలో నిలుస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. ఆదాయం క్రమేపి పెరుగుతుంది. నదీస్నానాలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుడిని పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.