జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ముఖ్యపనుల్లో శ్రద్ధ పెడితే విజయం సాధిస్తారు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రస్తుతం నూతన ప్రయత్నాలు అనుకూలించవు. కాలాన్ని వృధా చేయవద్దు. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వృషభ రాశివారికి ఈ రోజు మీకు ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్య పనుల్లో లక్ష్యం నెరవేరే వరకూ బాధ్యతగా పనిచేయండి. విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి. ఆలోచంచి నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అధికార యోగం ఉంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశంసించేవారు పెరుగుతారు. పెట్టుబడులు విశేష లాభాన్నిస్తాయి. ఆర్థికస్ధితి క్రమంగా బలపడుతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి, దైవబలంతో కొన్ని పనులు పూర్తవుతాయి. తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. కాలం మిశ్రమంగా ఉన్నందున ఫలితాలు నిదానంగా ఉంటాయి. ధర్మమార్గంలో ముందుకు సాగాలి. చెడు ఊహించవద్దు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. శుభవార్త వింటారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సింహ రాశి సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ప్రయత్నాలు కలసివస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొందరు కావాలని ఆవేశపరుస్తారు. ప్రశాంతంగా స్పందించాలి. మీ వినయవిధేయతలే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. భూగృహవాహన యోగాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అధికారులు ప్రసన్నులవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కృషిని బట్టి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే త్వరగా లక్ష్యాన్ని చేరతారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. తులా రాశి తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరిగే అవకాశముంది. రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేయవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. వ్యాపారయోగం అద్భుతంగా ఉంది. పలుమార్గాల్లో కనిపిస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి కి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. బాధ్యతలను సకాలంలో నిర్వహిస్తే మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలోను ఒత్తిడికి గురికావద్దు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కలహాలకు దూరంగా ఉండండి. చిన్న సమస్యను పెద్దదిగా చూడవద్దు. ఏ విషయంలోను బద్ధకం పనికిరాదు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ధనూ రాశి ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం. ఉద్యోగ ఫలితాలు అనుకూలం. లక్ష్యంపై దృష్టి నిలపండి. పనుల్లో స్పష్టత అవసరం. ప్రణాళిక వేసుకుని తదనుగుణంగా పనిచేస్తే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆత్మీయుల సూచనలతో మేలు జరుగుతుంది. మీ ఓర్పు మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలసివస్తుంది. అదృష్టవంతులు అవుతారు. ఇపుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రతిభతో పెద్దల్ని మెప్పిస్తారు. నూతన గృహయోగం ఉంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. కుంభ రాశి కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అనుకూలం. అధికార లాభముంది. అవకాశాల్ని వినియోగించుకుంటూ అభివృద్ధిని సాధించాలి. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. న్యాయపరమైన విజయం ఒకటి ఉంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందించే అంశాలున్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. ప్రారంభించిన పనులను వెంటనే పూర్తిచేయండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన కార్యసిద్ధినిస్తుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. కొన్ని విషయాల్లో కుటుంబసభ్యులు సూచనలు అవసరమవుతాయి. సత్యనిష్ట ధర్మనిరతి మిమ్మల్ని కాపాడతాయి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.