top of page
Suresh D

🔮 నేటి రాశి ఫలాలు.. వీరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి🌟

🌟 నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.01.2024 శనివారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.🌟

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అవకాశాలు కలసివస్తాయి. ఇతరులచే వర్చడు ఇబ్బందులను గ్రహిస్తారు. ఆర్థికంగా సంతృప్తిగా ఉంటారు. అనారోగ్య సమస్యలను లెక్కచేయకుండా వ్యవహరిస్తారు. సంతాన విషయంలో ఆశించినవి జరగగలవు. వివాదాల్లో కొన్నిటిని దూరం చేసుకోగలరు. విలాసాలకు ఖర్చుల్లో జాగ్రత్తలు పాటించాలి. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అప్పులకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలలో తగ్గి ఉండుట మంచిది. కుటుంబ సభ్యులచే ప్రయోజనాలుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్రేకమునకను గురిచేసే వ్యక్తులుంటారు. జాగ్రత్తలు పాటించండి. రాబడికి తగినట్లుగా మీ ఖర్చులను సరిచూసుకోవాలి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథునరాశి

మిథున రాశి జాతకులకు నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. వ్యాపారాలలో విస్తరణ ఆలోచనలు చేయగలరు. ఆదాయాలు ఆశించినట్లు ఉటాయి. శుభకార్యం జరుగు సూచనలు ఉన్నాయి. కొన్ని నిర్ణయాల్లో మార్చుచేర్పులు చేపడతారు. కుటుంబంలో సహకరించువారు పెరుగుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయత్నాలను వేగవంతం చేసుకోగలరు. అవకాశాలు కలసివస్తాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి జాతకులకు నేటి దిన ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి.. ఆదాయ వ్యవహారాల్లో సంతృప్తి పొందుతారు. విదేశీయతకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించుకుని సంతానంనకు శుభములు ఏర్పరచగలరు. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యము ఏర్పడుతుంది. బంధుమిత్రులచే మంచి సూచనలు పొందుతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ కృషికి తగిన ప్రయోజనాలు పొందుతారు. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలరు. బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. అప్పులను కొన్నిటిని తగ్గించుకోగలరు. స్థిరాస్తులపై దృష్టిపెట్టగలరు. సోదర సఖ్యత ఏర్పడగలదు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అధికారులచే చిన్నపాటి ఒత్తిడులుండును. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్తపడాలి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఆహార అలవాట్లు సమయానుకూలం పాటించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. సర్దుబాటు ధోరణితో సాగండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్యంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులచే సద్విమర్శలు ఉండగలవు. స్థిరాస్తుల వ్యవహారాలను కొంతకాలం వాయిదా వేసుకోండి. ఆందోళనకర అంశాల్ని దూరం చేసుకోగలరు. వ్యక్తిగత బాధ్యతల్ని స్వయంగానే చేసుకోండి. ప్రయాణాలను తగ్గించండి. అధిక ఖర్చులు ఇబ్బంది కలిగించును. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. శక్తిని అనుసరించి పనుల్ని చేపట్టుకోవాలి. కుటుంబ వ్యక్తులకు ముఖ్యమైన పనులు అప్పగించుటచే ప్రయోజనాలు పొందుతారు. అధికారిక వర్గంచే వృత్తి ఉద్యోగాలలో సాధారణ స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులుంటాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. భ్రాతృవర్గం వారితో జాగ్రత్తలు తప్పనిసరి. మీవి కాని పనులకు దూరంగా ఉంటూ గతంలో నిలిచిపోయిన పనుల్ని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటా బయటా అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చును. సంతానపు అవసరాలను తీర్చగలుగుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకరరాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. తల్లిదండ్రులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ వ్యక్తుల తీరు నచ్చకపోయినా అచేతన స్థితిలో కొనసాగుతారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా పరవాలేని స్థితులు కొనసాగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేపట్టుకొను సూచనలు ఉన్నాయి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. వృత్తి ఉద్యోగాల్లో గత ఇబ్బందులను కొన్నిటిని దూరం చేసుకుంటారు. కుటుంబ వ్యక్తులచే సహకారాలు అందుతాయి. స్నేహవర్గంచే ప్రయోజనాలు పొందుతారు. ఊహించనివిధంగా కొందరికి పదవీయోగం ఉంటుంది. ఉద్యోగాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పోటీతత్వమునకు దూరంగా ఉండటం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళ స్థితులు నెలకొను సూచనలున్నాయి. చేపట్టుకున్న పనులు ముందుకు సాగవు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆదాయాల కంటే చేయవలసిన ఖర్చులు ముందుగా ఏర్చడగలవు. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

bottom of page