top of page
Suresh D

🌟 నేటి రాశి ఫలాలు.. వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు 🌟

🔮 నేటి రాశి ఫలాలు తేదీ జనవరి 4, 2024 మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 🔮

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులను ఈరోజు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో కలసి కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది ఏర్చడే అవకాశాలున్నాయి. శివపార్వతుల అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగంలో మార్పులుంటాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. స్నేహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగులకు పెండింగ్‌ పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం కేటాయించాలి. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఏదైనా ప్రణాళికను రూపొందించవచ్చు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. మీరు ప్రత్యర్థులు, శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీ శక్తిని సరైన దిశలో ఉంచాలి. మీ వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. మీ ఆలోచనలు, ప్రణాళికలను బ్యాలెన్స్‌ చేసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగే అవకాశముంది జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పలుకుబడి గల వ్యక్తులను కలుస్తారు. వాహనాలు, యంత్రాలు నుంచి ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మరింత శు భఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులారాశి

తులారాశి వారికి నేటి రాశి ఫలాలు అంత అనుకూలంగా లేవు. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలేర్పడు సూచనలు ఉన్నాయి. కుటుంబపరంగా మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఉత్సాహంగా పనిచేయాలి. స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. మానసికంగా దృఢంగా ఉంటారు. విరోధులను తక్కువ అంచనా వేయవద్దు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఒక ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. దైవబలంతో పనులు పూర్తిచేస్తారు. సుఖసౌఖ్యాలున్నాయి. ఆరోగ్యం అనుకూలించును. ప్రయాణాలు కలసివస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ఏ పనిని మొదలుపెట్టినా సులువుగా పూర్తిచేయగలుగుతారు. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీనరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువుల సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులుంటాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శెనగలు దానమివ్వాలి. శెనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

bottom of page