top of page
MediaFx

టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..


పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ డాక్యుమెంటరీని ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి ఇలా పలువురు జక్కన్న గురించి మాట్లాడారు. చివరగా రాజమౌళి మాట్లాడుతూ.. నేను కేవలం నా కథకు మాత్రమే బానిసగా ఉంటాను అని చెప్పడం గమనార్హం. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ ట్రైలర్ పై నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఓ మై నెట్ ఫ్లిక్సు.. నీకు దండం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా విడుదలైన ట్రైలర్ లో రాజమౌళి గురించి టాలీవుడ్ హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా గొప్పగా చెప్పారు. కానీ వారికి నెట్ ఫ్లిక్స్ డబ్బింగ్ చెప్పించింది. ఇక్కడ అసలు కథ మలుపు తిరిగింది. తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్ చేప్పించాలనే సాహసం అసలు నెట్ ఫ్లిక్స్ ఎలా చేసింది..? పోనీ ఆ డబ్బింగ్ మన హీరోలకు సెట్ అయ్యిందా ?.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ తెలుగులో చూసినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోలతో కలిసి ఈ డాక్యుమెంటరీని నిర్మించింది నెట్ ఫ్లిక్స్.


bottom of page