top of page
MediaFx

నవ దళపతా?.. ఇదెప్పుడు పెట్టారు.. సుధీర్ బాబుపై ట్రోలింగ్

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోలకు ట్యాగ్స్ రావడం అంత సులభం కాదు. కంటిన్యూగా హిట్లతో అభిమానులను ఆకట్టుకుని దశాబ్దాలుగా అలరించే హీరోలకు మాత్రమే ఇలాంటి ట్యాగ్స్ లభించేవి. చిరంజీవి సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్‌గా ఎదిగినట్టుగా, ఇలాంటి ట్యాగ్స్ అభిమానులు, మీడియా లేదా ఇండస్ట్రీ వ్యక్తులే ఇచ్చేవారు. కానీ, ఈ మధ్యకాలంలో ఈ ధోరణి మారిపోయింది. కొత్త హీరోలు తమకు అనుకూలంగా ట్యాగ్స్ పెట్టుకోవడం ప్రారంభించారు, వీటి అర్ధం లేదా ఎవరిచ్చారన్నది కూడా తెలియదు. ఉదాహరణకు, సుధీర్ బాబు ఇటీవల తన పేరుకు ముందు "నవ దళపతి" అనే ట్యాగ్‌ పెట్టుకున్నాడు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. "హరోం హర" చిత్రానికి సంబంధించిన టైటిల్స్ పడినప్పుడు "నవ దళపతి" అని కనిపించడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఈ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. "నవ దళపతా? ఇది ఎప్పుడూ పెట్టారంటూ" ట్విట్టర్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. సుధీర్ బాబు ఇటీవల సరైన హిట్లు లేక సతమతం అవుతున్నాడు. "హరోం హర" సినిమా గత చిత్రాలతో పోలిస్తే కాస్త బెటర్ అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, సుధీర్ బాబు ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తుందేమో చూడాలి.


bottom of page