top of page
Shiva YT

వెంకటేష్ సినిమాలో ఎన్టీఆర్.. అంతే కాదు ఇద్దరు కలిసి డాన్స్ కూడా..💃🕺

వెంకటేష్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేసిన సినిమా ఎదో తెలుసా..? ఆ సినిమానే చింతకాయల రవి. యోగి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా అనుష్క నటించింది. అలాగే మమతామోహన్ దాస్ సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఈ సినిమాలో ఒక సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. షాబా షాబా భల్లే భల్లే అనే సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు అలాగే వెంకటేష్ తో కలిసి స్టెప్పులేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎంట్రీతో థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ తో సందడి చేశారు. ఇక ఈ ఇద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ సినిమా రావాలని అభిమానులు ఆశపడ్డారు కానీ అది ఇప్పటివరకు జరగలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అలాగే వెంకటేష్ శైలేష్ దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 🎬🌟

bottom of page