టాలీవుడ్ నుంచి ఇంత వరకు అధికారికంగా ఏపీ ప్రభుత్వం వద్దకు వెళ్లి, సీఎంని గానీ, సినిమాటోగ్రఫర్ మినిస్టర్‌ని గానీ.. సినీ పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్‌ను గానీ కలవలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ ప్రభుత్వంలో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీ పెద్దలంతా కూడా టాలీవుడ్ సమస్యలను చెప్పుకునేందుకు, పరిష్కారం కల్పించమని కోరేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లనున్నారు. సోమవారం నాడు ఈ భేటీ జరుగుతుందని సమాచారాం.
సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటుగా.. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్‌ని కోరనున్నారని సమాచారం.
ఇక భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారట. ఈ చర్చల్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్,హారిక హాసిని చినబాబు, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, అశ్వినీదత్, డి.వి.వి.దానయ్య, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, తదితరులు ఉన్నారు.
కల్కి సినిమాకు అర్జెంటుగా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల అనుమతి రావాల్సి ఉంటుంది. జూన్ 27న రాబోతోన్న ఈ చిత్రానికి అన్ని రకాల ఫెసిలిటీస్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.