top of page
Suresh D

పెను ప్రమాదం నుంచి బయట పడ్డ సింగర్ మంగ్లీ.. 😱

ప్రముఖ గాయని మంగ్లీ కి పెను ప్రమాదం తప్పింది.. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.  ప్రముఖ గాయని మంగ్లీ కు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. 🚗 కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 🕰



bottom of page