top of page
MediaFx

ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న టాప్ 10 యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇవే..


ప్రస్తుతం యూట్యూబ్‌.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌. యూట్యూబ్‌ ఛానల్స్, వీడియోల సంఖ్య ప్రతీ క్షణానికి పెరుగుతూ ఉంది. అయితే అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న టాప్ 10 యూట్యూబ్ ఛానల్స్ ఏంటో తెలుసుకుందాం!

  1. మిస్టర్ బీస్ట్: సుమారు 26.9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌తో మిస్టర్ బీస్ట్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. సాహసాలు, వింతైన స్టంట్లూ చేస్తూ డోనాల్డ్‌సన్‌ నడుపుతున్న ఈ ఛానల్‌ అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌.

  2. టి సీరీస్: భారత్‌కు చెందిన ఈ మ్యూజిక్‌ కంపెనీకి 26.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది.

  3. కోకోమిలాన్ - నర్సరీ రైమ్స్: 17.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో చిన్నారులకు సంబంధించిన వీడియోలు అందించే ఈ ఛానల్ మూడో స్థానంలో ఉంది.

  4. సెట్ ఇండియా: 17.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో సెట్ ఇండియా నాలుగవ స్థానంలో ఉంది. వివిధ రకాల వినోదం అందించే ఈ ఛానల్‌.

  5. కిడ్స్ డయానా షో: 12.2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో పిల్లల కంటెంట్‌ అందించే ఈ ఛానల్‌ 5వ స్థానంలో ఉంది.

  6. వ్లాడ్ అండ్ నిక్కి: 11.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో వ్లాడ్ అండ్ నిక్కి ఛానల్‌ 6వ స్థానంలో ఉంది.

  7. లైక్ నాస్త్య: 11.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో 7వ స్థానంలో ఉంది. పిల్లల కంటెంట్‌ అందించే ఈ ఛానల్‌.

  8. ప్యూడైఫై: సుమారు 11.1 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో ప్యూడైఫై 8వ స్థానంలో ఉంది. గేమింగ్ మరియు వినోదం కంటెంట్‌.

  9. జీ మ్యూజిక్‌ కంపెనీ: 1.07 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో 9వ స్థానంలో ఉంది. భారతీయ సంగీతం అందించే ఈ ఛానల్‌.

  10. WWE: సుమారు 1.02 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో WWE యూట్యూబ్‌ ఛానల్‌ పదవ స్థానంలో ఉంది.


Related Posts

See All

వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య..!💔

ఏపీలో జరిగిన ఘోర సంఘటనలో, నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల బెట్టింగ్ లో ఓడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

bottom of page