సాధారణంగా సినిమాలు సెట్స్‌పై లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా.. చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు సూపర్ స్టార్.
తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా..? చూసేయండి మరీ.. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు ఖాళీగానే ఉన్నారు. హాయిగా ఫ్యామిలీ వెకేషన్స్‌తో పాటు యాడ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నారు.
రాజమౌళి సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో.. ఈ లోపు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం సినిమాలేం చేయపోయినా.. మహేష్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కువగా ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేస్తున్నారు మహేష్.
ప్రతీ 15 రోజులకోసారి మహేష్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. సూపర్ కూల్ లుక్స్‌తో అందర్నీ మరోసారి మాయ చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ ఫోటోలిప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఫోటోస్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ఎప్పుడో రిలీజైన గుంటూరు కారం మరోసారి ట్రెండ్ అవుతుంది.
దానికి కారణం కుర్చీ మడతబెట్టి సాంగ్. అమెరికాలోని హూస్టన్‌లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లో కుర్చీ మడతబెట్టి పాటను ప్లే చేసారు.. చేయడమే కాదు డాన్సులు చేసారు. మొత్తానికి రాజమౌళి సినిమా మొదలయ్యేలోపే ప్రపంచానికి పరిచయం అవుతున్నారు మహేష్.