దర్శకుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్ గానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. తెలుగుసినిమా స్థాయిని ప్రపంచ నలుమూలల వ్యాపించేలా చేశారు రాజమౌళి. పరాజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట.
ఆ హీరోయిన్ ఎవరో కాదు చెన్నై చిన్నది త్రిష. రాజమౌళి స్వయంగా పిలిచి మరి హీరోయిన్ గా అవకాశం ఇస్తే.. త్రిష సింపుల్ గా రిజక్ట్ చేసిందట. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన సినిమా మర్యాద రామన్న కోసం ముందుగా త్రిషను హీరోయిన్ అనుకున్నారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్ కావడంతో, సునీల్ సరసన నటించడానికి త్రిష సంకోచించింది. దాంతో రాజమౌళి కొత్త హీరోయిన్స్ ను వెతకడం మొదలుపెట్టారు, ఆ క్రమంలోనే సలోని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.
మర్యాద రామన్న సినిమా తర్వాత సలోనికి పెద్దగా సినిమాల అవకాశాలు రాలేదు. ఇక త్రిష విషయానికొస్తే ఇప్పుడు ఆమె తెలుగులో, తమిళ్ లో బిజీగా మారిపోయింది. అలాగే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.