top of page
Suresh D

‘రామాయణం’ తెలుగు వర్షన్ కు డైలాగ్స్ రాయనున్న మాటల మాంత్రికుడు..?🎥✨


ఇటీవల ఆనిమల్ మూవీతో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ త్వరలో భారతీయ ఇతిహాస గాథ రామాయణం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. నితీష్ తివారి అత్యంత గ్రాండియర్ గా తెరకెక్కించనున్న ఈ మూవీలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో కెజిఎఫ్ స్టార్ యష్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించనుండగా సన్నీ డియోల్‌ను హనుమంతుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.ఇక ఈ రామాయణాన్ని దాదాపు మూడు భాగాలుగా రూపొందిస్తున్నారట. ఈ మూవీ గురించి ప్రతిరోజూ కొత్త అప్డేట్స్ బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 2న రామాయణం సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం కేవలం బాలనటులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నారని యష్, రణబీర్, సాయి పల్లవి ఇంకా షూటింగ్ సెట్‌కి వెళ్లలేదని సమాచారం. ఈ సినిమా మొదటిభాగంలో యష్ కనిపించరట.ఆయన రెండవ భాగం షూటింగ్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. అయితే మొదటి భాగంలో కూడా రావణుడి పాత్రను పరిచయం చేయాలనుకున్నారట నితీష్ తివారీ. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిచనున్నారని అంటున్నారు. అయితే దీని పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ క్రేజీ ప్రాజక్ట్ పై దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.🎥✨

bottom of page