top of page
MediaFx

ట్రూకాలర్ కొత్త ఏఐ కాల్ స్కానర్ వాయిస్ క్లోనింగ్ స్కామ్లను తిప్పికొట్టండి


ప్రపంచం వేగంగా మారుతోంది. ఆధునిక సాంకేతిక శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు ఉన్న అప్‌డేట్‌ రేపు ఉండటం లేదు. అంతలా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆవిర్భావం తర్వాత ప్రపంచ స్వరూపమే మారిపోతోంది.

కానీ, ఈ మార్పు ప్రమాదాలను కూడా పెంచుతోంది. సైబర్‌ నేరాలు, దీప్‌ఫేక్‌లు, వాయిస్‌ క్లోనింగ్‌ స్కామ్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌ అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది.

మూడు సెకండ్ల ఆడియోతోనే ఎవరి వాయిస్‌నైనా అనుకరించే ఈ టెక్నాలజీతో మోసగాళ్లు మన ప్రియమైన వారు, స్నేహితుల వాయిస్‌లతో సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు.

AI Call Scanner పరిచయం

ఈ ముప్పును తిప్పికొట్టడానికి ట్రూకాలర్ కొత్త సాధనాన్ని పరిచయం చేసింది. దాని పేరు ఏఐ కాల్‌ స్కానర్‌. ఇది వినియోగదారులకు నకిలీ కాల్‌లను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఈ కొత్త ఫీచర్ నిజమైన మానవ స్వరాలకు, ఏఐ రూపొందించిన స్వరాలకు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ట్రూకాలర్ యాప్‌లో ఏఐ కాల్ స్కానర్ అందుబాటులో ఉంది.

ఉపయోగించే విధానం

ఏఐ కాల్ స్కానర్‌ని ఉపయోగించడం సులభం. అనుమానాస్పద కాల్ వస్తే, ట్రూకాలర్‌ యాప్‌లోని బటన్‌ నొక్కితే చాలు. ట్రూకాలర్ కాలర్ వాయిస్ రికార్డ్ చేసి, విశ్లేషిస్తుంది. కొన్ని సెకన్లలో, వాయిస్ నిజమైనదా, నకిలీదా అని యాప్ మీకు తెలియజేస్తుంది.

ట్రూకాలర్ సీఈఓ ప్రకటన

ట్రూకాలర్‌ సీఈఓ అలాన్ మామెడి మాట్లాడుతూ, ఏఐ వాయిస్ స్కామ్‌లు సర్వసాధారణం అవుతున్న క్రమంలో ఈ సమస్యకు పరిష్కారం అందించామన్నారు.

bottom of page