top of page

ఇదే బెస్ట్‌ డిబేట్‌.. కమలా హారిస్‌తో చర్చపై ట్రంప్‌ స్పందన


అధ్యక్ష ఎన్నికలతో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్‌‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌ (Kamala Harris) మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. వాడీవేడిగా సాగిన ఈ డిబేట్‌లో పరస్పర విమర్శల దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇక కమలా హారిస్‌తో డిబేట్‌పై ట్రంప్‌ (Donald Trump) తొలిసారి స్పందించారు. ఇది ఓ గొప్ప చర్చగా అభివర్ణించారు. ఎప్పటికీ ఇది అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా (best debate ever) భావిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. హారిస్‌తో మరో చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కమలా హారిస్‌ కూడా ట్రంప్‌తో సెకెండ్‌ డిబేట్‌కు సిద్ధమైనట్లు ఉపాధ్యక్షురాలి ప్రచార చైర్‌ జెన్‌ ఓ మల్లే డిల్లాన్‌ తెలిపారు. అక్టోబర్‌లో రెండో డిబేట్‌ ఉంటుందని తెలిపారు.

కాగా, నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమాక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఇవాళ తొలి డిబేట్‌ జరిగింది. ఏబీసీ న్యూస్ నిర్వహించిన చ‌ర్చలో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ అనేక అంశాల‌పై త‌మ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అబార్షన్లు, యుద్ధాలు, ఆర్థికం, హౌజింగ్ సంక్షోభం లాంటి అంశాల‌పై చ‌ర్చించుకున్నారు. రిప‌బ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి క‌మ‌లా హ్యారిస్‌.. పోటాపోటీగా డిబేట్‌లో పాల్గొన్నారు. తొలుత ఇద్దరూ చ‌ర్చావేదిక‌పై హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్నారు. ఆ త‌ర్వాత త‌మ విధానాల‌ను వివ‌రించారు.

Related Posts

See All
ఎన్టీఆర్ ‘దేవ‌ర’ ట్రైల‌ర్‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌.

 
 
bottom of page