మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలోనే తొలిసారి క్రిమినల్ చర్యలు ఎదుర్కొని, దోషిగా నిర్దారణ అయిన వ్యక్తిగా నిలిచారు. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో చీకటి ఒప్పందం కేసులో న్యూయార్క్ జ్యూరీ ట్రంప్‌ను అన్ని అభియోగాల్లోనూ దోషిగా నిర్దారించింది. 2016 ఎన్నికల సమయంలో తమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు డేనియల్స్‌కు భారీ మొత్తంలో నగదు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ.
ఈ తీర్పుతో ట్రంప్ గరిష్టంగా నాలుగేళ్ల జైలు శిక్షకు గురవ్వచ్చు. ఇది రాబోయే ఎన్నికల్లో ఆయనకు భారీ ఎదురు దెబ్బ కావచ్చు. అయితే ట్రంప్ బెయిల్ లేకుండా విడుదలై, అప్పీల్‌కు సిద్ధమవుతున్నారు. జైలుకు వెళ్లినా, ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ట్రంప్ మాత్రం తాను అమాయకుణ్ణని, ఈ ఆరోపణలు తప్పుడు అని అంటున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బృందం, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ట్రంప్ మన ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆరోపించింది. జులై 11న ట్రంప్ శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యాయమూర్తి జువాన్ మెర్చన్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌కు నాలుగు రోజుల ముందే ఈ శిక్ష ఖరారు కావడం గమనార్హం.
జ్యూరీ 12 మంది సభ్యులు రెండు రోజుల పాటు 11 గంటలకుపైగా చర్చించి ఏకగ్రీవంగా తీర్పు ప్రకటించారు. ఈ కేసులో జ్యూరీ సభ్యులు రహస్యంగా వ్యవహరించారు.
2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారని, రహస్య పత్రాలు తీసుకెళ్లారని ట్రంప్‌పై ఫెడరల్ విచారణ కూడా కొనసాగుతోంది.