యువతి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఖాకీలు.. ప్రశ్నిస్తే ఇంతే ఉంటదని హెచ్చరిక📢👥
- Suresh D
- Jan 25, 2024
- 1 min read
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వొద్దని గత కొంతకాలంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వీరిపై పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్త అయినా ఓ విద్యార్థిని జుట్టు పట్టుకొని పోలీసులు లాక్కెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఘటన పట్ల విద్యార్థి సంఘాలు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని చెప్పినట్టే, ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు మహిళా కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.📢👥