top of page
Suresh D

18 గంటల్లో 155 సార్లు కంపించిన భూమి.. ఎగసి పడుతున్న అలలు.. సునామీ హెచ్చరికలు జారీ.. 🌍🚨

ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ సంతోషంగా గడుపుతోన్న వేళ.. ఆసియా దేశమైన జపాన్ లో ప్రకృతి కన్నెర్ర జేసింది. కొత్త సంవత్సరం 2024 లో అడుగు పెడుతూనే జపాన్‌ వరస భూకంపాలను ఎదుర్కొంటుంది. 🎉

ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ సంతోషంగా గడుపుతోన్న వేళ.. ఆసియా దేశమైన జపాన్ లో ప్రకృతి కన్నెర్ర జేసింది. కొత్త సంవత్సరం 2024 లో అడుగు పెడుతూనే జపాన్‌ వరస భూకంపాలను ఎదుర్కొంటుంది. 🎉

ఒకదాని తర్వాత ఒకటి బలమైన భూకంపాలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 18 గంటల్లో 155 సార్లు భూమి కంపించింది. కేవలం రెండు గంటల్లోనే 40 ప్రకంపనలువచ్చాయి. 🔴 జపాన్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అదే దేశ వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. 🌊 సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 13 మంది మరణించినట్లు ప్రకటించారు. 😢 అంతేకాదు మరోవైపు దాదాపు లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు.

ప్రాణాంతకమైన అలలు ఇంకా ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని .. తాము చెప్పే వరకూ ఇళ్లకు తిరిగి రావద్దని చెప్పారు. 🏠 7.6 తీవ్రతతో సంభవించిన అతిపెద్ద భూకంపంతో దేశంలో ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో భారీ విధ్వసం ఏర్పడింది. 🏝️ అనేక భవనాలు కూలిపోయాయి. జపాన్ వాతావరణ సంస్థ సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఇషికావా తీరంతో పాటు పరిసర ప్రాంతాలలో జపాన్ సముద్రంలో డజనుకు పైగా బలమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించింది.

భూకంపం కారణంగా కనీసం ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయని.. ప్రజలు లోపల చిక్కుకున్నారని ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. 🏚️ ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా నగరంలో మంటలు చెలరేగాయని, 30,000 ఇళ్లకు పైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 💔

bottom of page