top of page

🚨 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న కండ్లకలక..

తెలుగు రాష్ట్రాల్లో కండ్లకలక కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 😷 వర్షాలు, వరదలకు తోడు ఈ కండ్లకలకం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. 🏘️రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికి వరకు 2500పైగా కేసులు నమోదయ్యాయి.


తెలుగు రాష్ట్రాల్లో కండ్లకలక కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 😷 వర్షాలు, వరదలకు తోడు ఈ కండ్లకలకం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. 🏘️రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికి వరకు 2500పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్లోనే 400 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 😰🏥 మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న 6 వందల మంది విద్యార్థుల్లో 4వందల మందికి కండ్లకలక వచ్చింది. 🤒🏫ఒకరి నుంచి ఒకరికి ఇది సోకడం ఒకట్రెండు రోజుల్లో జరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇది కేవలం మంచిర్యాలకే పరిమితం కాలేదు..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా హెచ్చరికలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. 🚨🌍🔔రెండు రాష్ట్రాల్లో కలిపి అధికారికంగా నమోదైన కేసులో వెయ్యికిపైగా ఉన్నాయి. మొత్తంగా రెండున్నర వేల వరకూ కేసులు ఉండొచ్చన్నది అనధికారిక అంచనా. వానాకాలంలో సహజంగా కండ్లకలక వ్యాప్తి ఉంటుంది. 🏞️🔎కానీ ఈసారి ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమై కరోనా రేంజ్‌లో అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 🦠🛡️


 
 
bottom of page