top of page
MediaFx

బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం..హోటల్ గదుల్లోనే భారత ఆటగాళ్లు..


టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది. బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్‌పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్‌ నుంచి బయటపడేసేందుకు ప్లాన్ వేసింది. ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారా టీమ్ ఇండియాను భారత్‌కు రప్పించేందుకు జై షా ప్లాన్ చేసినట్లు సమాచారం. తుఫాన్ నుంచి టీమిండియాను బీసీసీఐ ఎలా కాపాడుతుంది?

బీసీసీఐ సెక్రటరీ జై షా మీడియాతో మాట్లాడుతూ.. ఆటగాళ్లను, భారత మీడియా ప్రతినిధులను సురక్షితంగా తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం బార్బడోస్ నుంచి చార్టర్డ్ విమానంలో బయలుదేరేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని, అయితే విమానాశ్రయం మూసివేయడం వల్ల ఈ అవకాశం కోల్పోయిందని జే షా తెలియజేశారు. చార్టర్డ్ విమానాలను నడుపుతున్న కంపెనీలతో బోర్డు టచ్‌లో ఉందని, బార్బడోస్ విమానాశ్రయం తెరిచిన వెంటనే, బృందం అమెరికా లేదా యూరప్‌కు వెళ్తుందని జై షా తెలియజేశారు. మంగళవారం కూడా బార్బడోస్‌ను వదిలి వెళ్లడం టీమిండియాకు కష్టంగా ఉంది. ఎందుకంటే, అక్కడ తుఫాన్ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. ఎయిర్‌పోర్టు అధికారులతో బీసీసీఐ టచ్‌లో ఉందని జే షా మీడియాకు తెలిపారు. విమానాశ్రయం పనిచేయడం ప్రారంభించిన వెంటనే, టీమిండియా చార్టర్డ్ విమానంలో అమెరికా లేదా యూరప్‌కు వెళ్తుంది. దీని తర్వాత అక్కడి నుంచి టీమిండియా భారత్‌కు రానుంది. అయితే, గాలి వేగం తగ్గినప్పుడే ఇదంతా సాధ్యమవుతుందని జై షా అన్నారు. ప్రకృతితో పోరాడాలని ఎవరూ కోరుకోరని, అందుకే వేచి ఉండటమే మంచిదని జై షా అన్నారు.


bottom of page