top of page
Shiva YT

ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే ఉద్ధవ్ శివసేన నేత హత్య.. 💔📡👥

ముంబైలోని దహిసర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మారిస్‌ నరోనాతోపాటు ఫేస్‌బుక్‌ లైవ్‌కు వచ్చారు ఉద్ధవ్‌ శివసేన లీడర్‌ అభిషేక్‌ గొషాల్కర్‌. అది కూడా నిందితుడు.. మారిస్‌ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. పలు విషయాలపై అభిషేక్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇక ఫేస్‌బుక్‌ లైవ్‌ ముగించిన వెంటనే.. మారిస్‌ నరోనా తన దగ్గరున్న గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. అభిషేక్‌ తప్పించుకునే లోపే పలురౌండ్లు కాల్చాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు అభిషేక్‌. వెంటనే అతన్ని బోరీవలీలోని కరుణ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డ్ అయింది. ఘోసల్కర్ శివసేన (UBT) నాయకుడు మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు.

మారిస్ భాయ్ ఘోసల్కర్‌పై ఐదుసార్లు కాల్పులు జరిపాడని.. దీని తరువాత, మారిస్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని.. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఘోసల్కర్‌పై కాల్పులు జరిపాడు.

ఈ ఘటన అనంతరం పెద్దఎత్తున ఉద్ధవ్‌ శివసేన మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. 🕊️🌐🔍


bottom of page