top of page
Suresh D

నో విజువల్.. ఓన్లీ సౌండ్.. ప్రేక్షకుల ఊహకు ఉపేంద్ర పరీక్ష 'యూఐ' టీజర్.. 🎥🎞️

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం చేస్తున్న సినిమా 'యూఐ: ది మూవీ'. ఉప్పీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న యూఐ సినిమా టీజర్ ను వినాయక చవితి సందర్భంగా ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు మేకర్స్. యూఐ టీజర్‌లో ఎప్పటిలాగే తన క్రియేటివిటీని ఉపయోగించాడు ఉపేంద్ర. ఇందులో ఎలాంటి విజువల్స్ లేవు. కొన్ని డైలాగ్స్, శబ్దాలు మాత్రమే వినిపించాయి. మొత్తం వీడియోలో వింత వింత శబ్దాలతోపాటు ఉపేంద్ర బోల్డ్ వాయిస్ మాత్రమే ఉంది. 2 నిమిషాలు 17 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 🎥🎞️



bottom of page