యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతోంది.
దేవర సినిమాను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికైయ్యారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా ఎన్టీఆర్‌తో దిగిన ఫొటో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎన్టీఆర్ ఫొటోను షేర్ చేస్తూ...'తారక్ గారు మన నిజమైన గ్లోబల్ స్టార్. మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నిజాయతీ, ముక్కుసూటితనం, అంతకుమించి ఎంతో వినమ్రత కలిగినవారు. మీరు చూపించే ప్రేమాభిమానం, స్ఫూర్తికి ధన్యవాదాలు. సింహం లాంటి మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్‌లో మీతో కలిసి నటించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని ట్వీట్ చేశారు. అయితే ఊర్వశి రౌతేలా షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ లుక్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ఈ ఫొటోపై ఎన్టీఆర్ అభిమానులు ఊర్వశి రౌతేలాను టార్గెట్ చేసుకుని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. . 'ఏం ఫిల్టర్ వాడావు తల్లి.. ఎన్టీఆర్ రూపులో మారిపోయాయి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకు దిగొచ్చిన ఊర్వశి .. అభిమానులకు సారీ చెప్పింది. 'చైనా ఫోన్ ఉపయోగించి ఈ ఫొటో తీసినందుకు సారీ'అంటూ మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 🎥✨