top of page
Shiva YT

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 🚆💥 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు..

వందేభారత్ రద్దు దృష్ట్యా మరోట్రైన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఆయా స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని రైల్వే సూచించింది.

వందేభారత్ ట్రైన్ కోసం టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ రైలు ఎక్కాలని.. ప్రయాణికులు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు దృష్ట్యా ఈరోజు ఉదయం 07:00 గంటలకు ప్రారంభమైన VSKP-SC ప్రత్యేక రైలులో క్యాటరింగ్ సేవలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను పొందాలని అభ్యర్థించారు. దీనికోసం రైలు హాల్టింగ్ స్టేషన్లలో PF నంబర్ 1లో ఫెసిలిటేషన్ కౌంటర్‌ను సంప్రదించాలని రైల్వే అధికారులు కోరారు.

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు 20833 నంబర్‌తో, సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు 20834 నంబర్‌తో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ సర్వీసు అందుబాటులో ఉండదు. ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో మాత్రమే ఈ వందేభారత్ ట్రైన్ ఆగుతుంది. 🚄😊

bottom of page