top of page
Suresh D

కాశీని వారణాసి అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

వారణాసిని భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అని పిలుస్తారు. అంతేకాదు.. ఈ నగరాన్ని ‘బనారస్’ మరియు ‘కాశీ’ అని కూడా పిలుస్తారు.

ఈ నగరం హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. దీనిని అవిముక్త్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. గంగ, శివుడు కొలువైన ఈ నగరానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వారణాసి అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక, మతపరమైన కేంద్రంగా విరాజిల్లుతోంది.వారణాసి మూలం గురించి ప్రస్తావించినట్టయితే..  పురాణాల ప్రకారం శివుడు ఈ కాశీ నగరాన్ని సుమారు 5000 సంవత్సరాల క్రితం స్థాపించాడు. అంతే కాదు, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుని రూపంలో శివుడు ఇక్కడ భక్తులతో పూజలందుకుంటున్నాడు. నేటికీ బనారస్ హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రం కావడానికి ఇదే కారణం. ఈ నగరం స్కాంద పురాణం, రామాయణం, మహాభారతం, పురాతన వేదం, ఋగ్వేదంతో సహా అనేక హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడింది.ఈ నగరానికి వారణాసి అనే పేరు వరుణ నది, అసి నది అనే రెండు స్థానిక నదుల నుండి వచ్చింది. ఈ రెండు నదులు వరుసగా ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి గంగా నదిలో కలుస్తాయి. ఇది కాకుండా, ఈ నగరం పేరు గురించి పురాతన కాలంలో వరుణ నదిని వారణాసి అని పిలుస్తారని, దాని కారణంగా ఈ నగరాన్ని వారణాసి అని పిలుస్తారు. ఇది కాకుండా, ఈ నగరాన్ని బనారస్, కాశీ, సిటీ ఆఫ్ లైట్, సిటీ ఆఫ్ భోలేనాథ్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.

bottom of page