top of page
MediaFx

వార్నీ వీటికెంత బద్ధకం..!గాల్లో ఎగరలేక బస్‌ జర్నీ చేస్తున్న కాకులు..


సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. జంతువుల జీవన విధానం, పక్షులు చేసే విన్యాసాల్ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటిదే ఇక్కడ కూడా ఒక వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అందులో కొన్ని కాకులు ఒక బస్సుపై ప్రయాణించాయి. ఇలాంటి అరుదైన సంఘటనను స్థానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. వైరల్‌ అవుతున్న వీడియో మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందినదిగా తెలిసింది. బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్‌) బస్సుపై కాకుల సమూహం వాలింది. అంతలోనే ఆ బస్సు కదలడంతో కాకులన్నీ అలాగే బస్సుపైనే ప్రయాణించాయి. ఈ వీడియో క్లిప్‌ను ఒక యూజర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. అర్రరే ఈ కాకులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అని క్యాప్షన్‌లో రాశారు. కాగా, కాకులు బస్సుపై ప్రయాణించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కాకుల గుంపు ముంబై టూర్‌కు వెళ్తున్నాయా..? అంటూ పలువురు ప్రశ్నించారు. ముంబైలో కాకులు కూడా ప్రజా రవాణాను వినియోగిస్తున్నాయని మరి కొందరు కామెంట్‌ చేశారు. అలాగే ‘క్రోసెంట్’ ను ఆస్వాదించడానికి ఆ కాకులు వెళ్తున్నాయని, ప్రసిద్ధ ‘క్రో-ఫోర్డ్ మార్కెట్’ వాటి చివరి గమ్యస్థానం కావచ్చని మరి కొందరు ఫన్నీగా వ్యాఖ్యనించారు.


bottom of page