సినీరంగంలోని సెలబ్రిటీలకు, రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెప్పే వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. వాస్తవానికి ఆయన కూడా వీరందరి జాతకాలు చెప్పి ఒక సెలబ్రిటీలా మారిపోయారు.
రాజకీయ రంగంలోకానీ, సినీ రంగంలోకానీ ఏ సమయంలో ఎలా ఎవరికి ఏ జాతకం చెబితే తాను వార్తల్లో నిలుస్తాను అనే విషయాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నారు. ఆ ప్రకారమే సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు విడుదల చేస్తుంటారు. తాజాగా ఆయన తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గురించి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చెప్పిన జ్యోతిష్యంపై భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఆయన గతంలోనే చెప్పారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేణుస్వామి మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కేటీఆర్ తప్పకుండా అరెస్ట్ అవుతారని చెప్పారు. అయితే ఆయన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే వేణుస్వామి చెబుతున్న జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కాంగ్రెస్ పేరుతో కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలు కూడా వేణుస్వామి వీడియోను షేర్ చేస్తూ గులాబీ శ్రేణులను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తున్నాయి. 🗳️✨